చౌడేపల్లి, అక్టోబర్ 4 (సత్య వెలుగు న్యూస్):
చారాల కామ్రేడ్ తోటి వెంకటరామయ్య మృతి కమ్యూనిస్టు, దళిత ఉద్యమాలకు తీరని లోటని పలువురు నాయకులు పేర్కొన్నారు. వెంకటరామయ్య కమ్యూనిస్టు రాడికల్స్ ఉద్యమంలో ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్‌తో కలిసి పనిచేసినట్లు వారు తెలిపారు.
భూస్వాముల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, పేద రైతులకు భూమి హక్కులు కల్పించాలనే డిమాండ్‌తో ఆయన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు. సామాజిక మార్పు, చట్టపరమైన హక్కుల సాధన కోసం ఆయన కృషి చేశారని పేర్కొన్నారు.
చారాల కో-ఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ ద్వారా ఎస్సీ వర్గాలకు భూముల పంపిణీ, పట్టాల మంజూరు వంటి అంశాలపై పలుమార్లు ఉద్యమాలు నిర్వహించినట్లు నాయకులు గుర్తుచేశారు.
వెంకటరామయ్య భౌతికకాయాన్ని సందర్శించిన కమ్యూనిస్టు, దళిత నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బ్యాంక్ రెడ్డప్ప, డాక్టర్ చంద్ర, గుండ్లూరు కృష్ణమూర్తి, బస్టాండ్ శేఖర్, మాజీ సర్పంచ్ వేణు, ఎం. మునుస్వామి, వెంకటరమణ, జయప్ప, ఎర్రగానిపల్లి వేణు, వసంతపల్లి చెంగల్రాడు, కూరపర్తి శ్రీనివాసులు, వీఆర్వో కేశవులు తదితర కమ్యూనిస్టు, దళిత నాయకులు పాల్గొని వెంకటరామయ్యకు నివాళులర్పించారు.