గద్దర్‌తో కలిసి ఉద్యమించిన చారాల కామ్రేడ్ వెంకటరామయ్య మృతి

చౌడేపల్లి, అక్టోబర్ 4 (సత్య వెలుగు న్యూస్): చారాల కామ్రేడ్ తోటి వెంకటరామయ్య మృతి కమ్యూనిస్టు, దళిత ఉద్యమాలకు తీరని లోటని పలువురు నాయకులు పేర్కొన్నారు. వెంకటరామయ్య కమ్యూనిస్టు రాడికల్స్ ఉద్యమంలో ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్‌తో కలిసి పనిచేసినట్లు వారు తెలిపారు. భూస్వాముల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, పేద రైతులకు భూమి హక్కులు కల్పించాలనే డిమాండ్‌తో ఆయన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు. సామాజిక మార్పు, చట్టపరమైన హక్కుల సాధన కోసం ఆయన కృషి చేశారని పేర్కొన్నారు. చారాల కో-ఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ ద్వారా...