కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత సమస్యపై విజయ్ కుమార్ ఐఏఎస్‌కు వినతి

-న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం: విజయ్ కుమార్ హామీ నెల్లూరు, అక్టోబర్ 14: కోటలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత సమస్యను పరిష్కరించాలని కోరుతూ సమాజ చైతన్య సమితి, బహుజన యూత్ ఫోర్స్ నాయకులు మాజీ ఐఏఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు విజయ్ కుమార్‌ను కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నెల్లూరులోని ఎస్‌ఎస్ కన్వెన్షన్ హాల్‌లో సింహపురి చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోట...