కొత్త పార్టీపై విజయసాయిరెడ్డి ప్రకటన

- సెక్యులరిజంపై ఘాటు వ్యాఖ్యలు - మూడో రాజకీయ శక్తిగా ఎదుగుతామని ధీమా - ఆలయాల్లో వివక్షపై ఆగ్రహం తిరుపతి, అక్టోబర్ 8, సత్య వెలుగు న్యూస్: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు రాజకీయ, సామాజిక అంశాలపై స్పందించారు. కొందరు ఆలయాల్లో అర్చకులు ఇచ్చే తీర్థాన్ని స్వీకరించినట్లు నటిస్తూ కిందకు వదిలేస్తారని, అదే వారు పాటించే సెక్యులరిజమని విమర్శించారు. తాను స్వచ్ఛమైన హిందువునని పేర్కొంటూనే, ఇతర మతాల ప్రార్థనా స్థలాలను కూడా సందర్శిస్తానని చెప్పారు. మతాల మధ్య పరస్పర...