పెళ్లకూరు మండలానికి రెగ్యులర్‌ వెటర్నరీ డాక్టర్లు ఎప్పుడు?

-మూడు పశువైద్యశాలలు.. డాక్టర్లు మాత్రం కరువు! -24 పంచాయతీలకు ఇదేనా పశువైద్య సేవలు? -పశువులు అనారోగ్యానికి గురైతే దిక్కెవరు? పెళ్లకూరు, సత్య వెలుగు న్యూస్:తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో పశువైద్య సేవల పరిస్థితిపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మండలంలో మొత్తం 24 పంచాయతీలు ఉండగా, కేవలం మూడు పంచాయతీల్లో మాత్రమే పశువైద్యశాలలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. పెళ్లకూరు, చెంబెడు, పునబాకు ప్రాంతాల్లో పశువైద్యశాలలు ఉన్నప్పటికీ, ఈ మూడు కేంద్రాల్లోనూ రెగ్యులర్‌ పశువైద్యులు అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మూడు పశువైద్యశాలల్లో ఒక్క రెగ్యులర్‌ డాక్టర్‌...