ఆరోగ్యశ్రీ ఉన్నా సీఎంఆర్‌ఎఫ్ ఎందుకు? పేదలకు వైద్య సహాయ పథకాలపై అవగాహన అవసరం!

సత్య వెలుగు న్యూస్  | ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రి పాలైతే సామాన్య కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా తలకిందులవుతుంది. ముఖ్యంగా గుండె జబ్బులు, క్యాన్సర్‌, కిడ్నీ సమస్యలు, ప్రమాదాల్లో తీవ్ర గాయాలు వంటి సందర్భాల్లో లక్షల రూపాయల వైద్య ఖర్చులు కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెట్టే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న డా. ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ), ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) పథకాలపై ప్రజలకు అవగాహన అవసరం. ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు సీఎంఆర్‌ఎఫ్ ఎందుకు? రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా...