కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి తోడ్పడండి: మాజీ చైర్పర్సన్ మైలారి శోభారాణి
సత్య వెలుగు న్యూస్,నాయుడుపేట: నవంబర్ 1న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని మాజీ చైర్పర్సన్ మైలారి శోభారాణి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం నాయుడుపేట మున్సిపాలిటీలోని 22వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి పాలెం వెంకటేశ్వర్లుతో కలిసి ఆమె ఎల్.ఏ. సాగరంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కూటమి అభ్యర్థులకు మద్దతు కోరారు. 22వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పాలెం వెంకటేశ్వర్లుతో పాటు చైర్పర్సన్ అభ్యర్థి షేక్ షకీరాకు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని...