నాయుడుపేట 3వ వార్డులో వైసీపీ అభ్యర్థి పాలేటి నాగార్జున విస్తృత ప్రచారం
నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్:నాయుడుపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఇందులో భాగంగా 3వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పాలేటి నాగార్జున సోమవారం విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులోని ఎన్ఎస్ఆర్ కాలనీ, రైల్వే స్టేషన్ రోడ్డు, రైల్వే క్వార్టర్స్ తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యటిస్తూ ఓటర్లను కలిశారు. ప్రచారంలో భాగంగా ప్రతి వీధిలో ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, మహిళలు, వృద్ధులు, యువతతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో...