sathyavelugu.com
Date of Publish : 09 October 2026, 9:41 pm Posted by : Dr.K.Suresh Editor

పరిశ్రమలు తరలిపోవడానికి వైసీపీ నేతలే కారణం: అమర్నాథ్ రెడ్డి

పుంగనూరు, అక్టోబర్ 9, సత్య వెలుగు న్యూస్: పరిశ్రమలు, పెట్టుబడిదారులు ఇతర రాష్ట్రాలకు తరలిపోవడానికి వైసీపీ నేతలే కారణమని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు. పుంగనూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమరరాజా పరిశ్రమ తరలింపునకు గత ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు.

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం కూటమి ప్రభుత్వ బాధ్యతని, హంద్రీ-నీవా జలాలతో రైతులకు ప్రయోజనం కలుగుతోందని పేర్కొన్నారు. టీడీపీపై అసత్య ఆరోపణలు చేయడం మానుకుని ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని వైసీపీ నేతలకు సూచించారు.