sathyavelugu.com
Date of Publish : 29 October 2026, 9:00 am Posted by : Dr.K.Suresh Editor

కోగిలి ఎంపీటీసీ బరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పనబాక శ్రావణి!

-ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి

చిట్టమూరు | సత్య వెలుగు న్యూస్:చిట్టమూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొన్న నేపథ్యంలో, కోగిలి ఎంపీటీసీ సెగ్మెంట్‌ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పనబాక శ్రావణి పోటీ చేస్తున్నారు.

ఈ సందర్భంగా కోగిలి సెగ్మెంట్ పరిధిలోని ఓటర్లను ఉద్దేశించి ఆమె తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామ అభివృద్ధికి కృషి చేయడం, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించడం తమ లక్ష్యమని ప్రచారంలో పేర్కొంటున్నారు.

కోగిలి సెగ్మెంట్ ఓటర్లు తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి పనబాక శ్రావణిని గెలిపించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను కలిసి తమ అభ్యర్థికి మద్దతు కోరుతున్నారు.