sathyavelugu.com
Date of Publish : 31 October 2026, 9:27 am Posted by : Dr.K.Suresh Editor

పెళ్లకూరు మండలంలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం – జోరు!జెడ్పీటీసీ అభ్యర్థి ప్రభావతమ్మ

పెళ్లకూరు – సత్య వెలుగు న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పెళ్లకూరు మండలంలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పెళ్లకూరు మండల వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి కామిరెడ్డి ప్రభావతమ్మ గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామగ్రామాన పర్యటిస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.

రోసనూరు, బంగారంపేట, నందిమాల, రాజుపాలెం, చెంబేడు, ఆర్ధమాన, పునబాక తదితర గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభావతమ్మ ఓటర్లను, ముఖ్యంగా మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు.

జగన్ ఆశీస్సులతో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తాం

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు మాట్లాడుతూ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో పెళ్లకూరు మండలంలో పార్టీ జెండా ఎగురవేయడమే తమ లక్ష్యమని తెలిపారు. జెడ్పీటీసీ అభ్యర్థి కామిరెడ్డి ప్రభావతమ్మకు ప్రజల మద్దతు కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్‌పై ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో మండలంలోని పలు గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.