కలెక్టర్‌కు వైఎస్సార్సీపీ నేతల వినతి, స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని విజ్ఞప్తి
నెల్లూరు, అక్టోబర్ 3 — సత్య వెలుగు న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాత వైఖరి పాటించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) నేతలు జిల్లా కలెక్టర్‌ను కలిశారు. వైఎస్సార్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు పార్టీ నాయకులు కలెక్టరేట్లో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఓటరుకు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని వారు కోరారు. ఈ సందర్భంగా...