-నాయకులు, కార్యకర్తలకు మాజీ మంత్రి ఆర్కే రోజా దిశానిర్దేశం
నగరి, సత్య వెలుగు న్యూస్ : నగరి రూరల్ మండలంలోని అన్ని పంచాయతీలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, యువత, మండల నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
నగరిలోని మాజీ మంత్రి ఆర్కే రోజా కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యక్రమాలు, గ్రామస్థాయిలో సమన్వయం తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి పంచాయతీలో పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయడంతో పాటు గ్రామస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
ప్రతి నాయకుడు, కార్యకర్త తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
అనంతరం నగరి రూరల్ మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ కేడర్‌కు ఐడీ కార్డులను ఆర్కే రోజా చేతుల మీదుగా పంపిణీ చేశారు. పార్టీ కేడర్‌ను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లేందుకు ఐడీ కార్డులు ఉపయోగపడతాయని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నగరి రూరల్ మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పంచాయతీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, యువత తదితరులు పాల్గొన్నారు.