sathyavelugu.com
Date of Publish : 30 October 2026, 11:44 am Posted by : Dr. S.sudhakar

ZPTC అభ్యర్థి ఆస్తులు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే!

సత్య వెలుగు న్యూస్, పుత్తూరు , అక్టోబర్ 30: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ZPTC అభ్యర్థి ఆస్తుల వివరాలు చర్చనీయాంశంగా మారాయి. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం టీడీపీ ZPTC అభ్యర్థి మమత శ్రీ తన ఎన్నికల అఫిడవిట్‌లో మొత్తం రూ.172.27 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.

అఫిడవిట్ వివరాల ప్రకారం ఆమెకు రూ.162.99 కోట్ల స్థిరాస్తులు, రూ.9.28 కోట్ల చరాస్తులు ఉన్నాయి. వీటిలో 44.62 ఎకరాల భూమి, రూ.24.89 కోట్ల విలువైన ఇళ్లు, 1.10 కిలోల బంగారం, 15 కిలోల వెండి ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే గూడ్స్ వాహనాలు, ట్రక్కులు కూడా ఉన్నట్లు వెల్లడించారు.

మరోవైపు తనకు రూ.32 కోట్ల అప్పులు ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు.

ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడైన ఈ ఆస్తుల వివరాలు స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.