అతివేగం ప్రమాదకరం.. ప్రాణాలపై నిర్లక్ష్యం వద్దు! బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి – పరిమిత వేగంతోనే ప్రయాణించండి!

-బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి . -పరిమిత వేగంతోనే ప్రయాణించండి!: పుత్తూరు ,నవంబర్ 13, సత్య వెలుగు :వాహనదారులారా.. ఒక్క క్షణం ఆలోచించండి! అతివేగం మీ ప్రాణాలకే కాదు, మీ కుటుంబ భవిష్యత్తుకు కూడా ప్రమాదకరం. బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలి. ఓవర్ స్పీడ్‌కు దూరంగా ఉండి, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పరిమిత వేగంతో ప్రయాణించాలి. మిమ్మల్ని నమ్ముకుని ఇంటి వద్ద భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలన్నదే వారి ఆశ....