sathyavelugu.com
Date of Publish : 05 November 2026, 6:06 pm Posted by : T.Srinivas teja sullurpeta Reportor

ఇల్లుపూరు పంచాయతీలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. 83 శాతం ఓటింగ్ నమోదు

సూళ్లూరుపేట, సత్యవెలుగు న్యూస్ : సూళ్లూరుపేట మండలంలోని ఇల్లుపూరు పంచాయతీలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. పంచాయతీ పరిధిలో మొత్తం మూడు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయగా, సుమారు 83 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిసింది.

ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగియడంతో అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొనడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.