sathyavelugu.com
Date of Publish : 06 November 2026, 7:58 pm Posted by : Dr. S.sudhakar

ఎన్నికల విధుల్లో అకాల మరణం.. ఉద్యోగుల కుటుంబాలకు భారీ పరిహారం!

సత్య వెలుగు న్యూస్, నవంబర్ 6:

హింసాత్మక ఘటనల్లో మరణిస్తే రూ.30 లక్షలు.. సాధారణ మరణానికి రూ.15 లక్షలు!

అమరావతి: ఎన్నికల విధులు నిర్వర్తిస్తూ దురదృష్టవశాత్తూ అకాల మరణం చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం G.O.Ms.No.1346 ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

ఈ ఉత్తర్వుల ప్రకారం ఎన్నికల విధుల్లో ఉండగా హింసాత్మక ఘటనల కారణంగా ఉద్యోగి మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.30 లక్షల ఆర్థిక పరిహారం అందజేయనున్నారు. అలాగే అనివార్య కారణాలతో సాధారణ మరణం (Normal Death) సంభవిస్తే మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల పరిహారం చెల్లించనున్నారు.

ఎన్నికల విధుల్లో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందేలా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించినట్లు తెలియజేయబడింది.

ప్రజాస్వామ్య ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం కొంతమేర అండగా నిలవనుంది