ఎన్నికల విధుల్లో అకాల మరణం.. ఉద్యోగుల కుటుంబాలకు భారీ పరిహారం!
సత్య వెలుగు న్యూస్, నవంబర్ 6: హింసాత్మక ఘటనల్లో మరణిస్తే రూ.30 లక్షలు.. సాధారణ మరణానికి రూ.15 లక్షలు! అమరావతి: ఎన్నికల విధులు నిర్వర్తిస్తూ దురదృష్టవశాత్తూ అకాల మరణం చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం G.O.Ms.No.1346 ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఈ ఉత్తర్వుల ప్రకారం ఎన్నికల విధుల్లో ఉండగా హింసాత్మక ఘటనల కారణంగా ఉద్యోగి మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.30 లక్షల ఆర్థిక పరిహారం అందజేయనున్నారు. అలాగే అనివార్య...