సత్య వెలుగు న్యూస్, పుత్తూరు, నవంబర్ 11: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భావ ప్రకటన వెలువడింది. విజయసాయి ‘పరివర్తన రాజనీతి పార్టీ’ పేరుతో నూతన రాజకీయ పార్టీని ప్రకటించినట్లు సమాచారం.
ఈ పార్టీకి సంబంధించిన జెండాను తెలుపు, కాషాయ రంగులతో రూపొందించారు. జెండా మధ్యభాగంలో ధర్మచక్రం గుర్తును ఏర్పాటు చేశారు.
కొత్త పార్టీ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో మరో రాజకీయ వేదిక తెరపైకి వచ్చినట్లయింది. పార్టీ లక్ష్యాలు, సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణ, పార్టీ నిర్మాణంపై మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.