కార్వేటినగరం హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్!
-మరో నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు సత్య వెలుగు న్యూస్, పుత్తూరు ,నవంబర్ 10: కారు విషయంలో మధ్యవర్తిత్వం చేసినందుకు కక్ష పెంచుకుని యుగంధర్ హత్యకు కుట్ర.. ఉద్దేశపూర్వకంగా కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి దారుణ హత్య. కార్వేటినగరం: చిత్తూరు జిల్లా కార్వేటినగరం పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన యుగంధర్ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని కలిపి మొత్తం నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు...