sathyavelugu.com
Date of Publish : 13 November 2026, 6:54 pm Posted by : S. Sunil

జైలు నుంచే ఎన్నికల బరిలో.. విజయం సాధించిన కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి

–చిల్లకూరులో నూతన జడ్పీటీసీని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించిన మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య

సత్య వెలుగు న్యూస్, నవంబర్ 13, పెళ్లకూరు:  జైలు నుంచే జడ్పీటీసీ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించిన కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి రాజకీయంగా ప్రత్యేక చర్చకు కేంద్రబిందువుగా నిలిచారు. ఎన్నికల్లో ఆయన విజయం సాధించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆనందం వ్యక్తమైంది.

హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలైన కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి నేరుగా చిల్లకూరులోని తన నివాసానికి చేరుకున్నారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం సూళ్లూరుపేట నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పార్టీ సీనియర్ నాయకులతో కలిసి చిల్లకూరులోని కామిరెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, నాయుడుపేట మాజీ ఏఎంసీ చైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి, నాయుడుపేట వైసీపీ పట్టణ అధ్యక్షుడు కలికి మాధవరెడ్డి, టీఎంఆర్ గ్రూప్ అధినేత తంబిరెడ్డి మోహన్ రెడ్డి తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.