నగరి డిగ్రీ కళాశాల వద్ద మాజీ మంత్రి ఆర్కే రోజా ఆందోళన!

-ఇల్లత్తూరు MPTC ఫలితంపై అభ్యంతరం.. -రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ సత్య వెలుగు న్యూస్ నగిరి: నగరి డిగ్రీ కళాశాల వద్ద మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆర్కే రోజా నిరసనకు దిగారు. విజయపురం మండలం ఇల్లత్తూరు MPTC స్థానంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించినప్పటికీ, టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేసిన ఆర్కే రోజా, వెంటనే రీకౌంటింగ్ నిర్వహించి న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. కౌంటింగ్ కేంద్రం...