నగిరి బస్టాండ్ కాస్తా మార్కెట్‌గా మారిందా?

-ట్రాఫిక్ జామ్‌తో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు.. అధికారుల చర్యలు అవసరం! సత్య వెలుగు న్యూస్ | నగిరి | నవంబర్ 6, 2026 నగిరి: పట్టణంలోని ప్రధాన బస్టాండ్ పరిసరాలు మార్కెట్‌ను తలపిస్తున్నాయి. బస్టాండ్ సమీపంలో వ్యాపార కార్యకలాపాలు, రోడ్డు పక్కన దుకాణాల ఏర్పాటు కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతున్నట్లు స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రయాణికుల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు ఆటంకం కలగడంతో సామాన్య ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా...