పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు
సత్యవేలుగు న్యూస్ దొరవారిసత్రం: తిరుపతి జిల్లా, దొరవారిసత్రం మండలం, యేకొల్లు గ్రామ పరిధిలోని వ్యవసాయ పొలాలు, రహదారి సమీపంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు పడిపోయి ఉండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారిపై నిత్యం చాలామంది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. రైతులు, ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఈ మార్గంలో ప్రయాణిస్తుండటంతో పడిపోయిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, ప్రమాదకరంగా ఉన్న...