పుత్తూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా హస్తం గుర్తుతో బరిలో పీడీ నారాయణస్వామి!
సత్య వెలుగు న్యూస్ – పుత్తూరు: అక్టోబర్ 31: పుత్తూరు మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తుతో పీడీ నారాయణస్వామి ఎన్నికల బరిలో నిలిచారు. నగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కార్తికేయన్ బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలోనే ఇది తొలి విజయంగా పార్టీ శ్రేణులు, పట్టణ ప్రజలు అభివర్ణిస్తున్నారు. ఇప్పటివరకు పెద్దగా కనిపించని కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును సుమారు 40 వేల బ్యాలెట్ పేపర్ల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేలా అభ్యర్థిని బరిలో నిలపడం పట్ల పట్టణవాసులు హర్షం...