sathyavelugu.com
Date of Publish : 03 November 2026, 10:41 pm Posted by : Dr. S.sudhakar Rc Reportor Nagiri

పుత్తూరు మున్సిపాలిటీ 15వ వార్డులో టీడీపీ అభ్యర్థి ఘన విజయం.. భారీ మెజారిటీతో ఏ. మణి గెలుపు!

సత్య వెలుగు న్యూస్, పుత్తూరు నవంబర్ 3: పుత్తూరు మున్సిపాలిటీ 15వ వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏ. మణి ఘన విజయం సాధించారు. ప్రత్యర్థులపై అధిక మెజారిటీ సాధించి విజయకేతనం ఎగురవేశారు. ఈ విజయంతో వార్డులో టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.

విజయం సాధించిన ఏ. మణికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభినందనలు తెలియజేశారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేశారు