పుత్తూరు 15వ వార్డులో ప్రశాంతంగా పోలింగ్.. 84 శాతం ఓటింగ్ నమోదైనట్లు అంచనా!

పుత్తూరు సత్య వెలుగు న్యూస్, నవంబర్ 1: పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో ఈరోజు జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు చోటుచేసుకోకుండా ఓటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగింది. ఈ వార్డులో సుమారు 84 శాతం పోలింగ్ నమోదైనట్లు అంచనా వేస్తున్నారు. ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సందర్భంగా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు....