సత్య వెలుగు న్యూస్ పుత్తూరు నవంబర్ 9: పుత్తూరు మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ హెచ్. అజిత సుబ్బు గారిని ఈరోజు జి. రమేష్ నాయుడు ఆధ్వర్యంలో వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కరీం భాషా, మునిశేఖర్, మురళి తదితరులు పాల్గొని కౌన్సిలర్ హెచ్. అజిత సుబ్బును అభినందించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.