పుదురు పంచాయతీ సచివాలయంలో సిబ్బంది ఎక్కడ?
-సమయపాలన పాటించడం లేదంటూ గ్రామస్తుల ఆవేదన.. విధులపై ఉన్నతాధికారులు విచారణ జరపాలని డిమాండ్! సత్య వెలుగు న్యూస్ | నాయుడుపేట: నాయుడుపేట మండలం పుదురు గ్రామ పంచాయతీ సచివాలయంలో సిబ్బంది సమయపాలన పాటించడం లేదంటూ పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ సేవలు, సమస్యల పరిష్కారం కోసం సచివాలయానికి వస్తున్న గ్రామస్తులకు సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వం ప్రజలకు పాలనను చేరువ చేయాలనే ఉద్దేశంతో గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు...