sathyavelugu.com
Date of Publish : 03 November 2026, 11:01 am Posted by : Dr. S.sudhakar Rc Reportor Nagiri

ప్రతి గడపకు కాంగ్రెస్ ప్రచారం.. జోరుగా జనంలోకి జడ్పీటీసీ అభ్యర్థి!

సత్య వెలుగు న్యూస్, పుత్తూరు నవంబర్ 2: కార్వేటి నగరం: కాంగ్రెస్ పార్టీ తరఫున జడ్పీటీసీ అభ్యర్థి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మండలంలోని గ్రామాల్లో ప్రతి గడపను తట్టి ఓటర్లను కలుస్తూ, కాంగ్రెస్ పార్టీ విధానాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, తమకు మద్దతు తెలిపి ఆశీర్వదించాలని అభ్యర్థి కోరుతున్నారు. గ్రామాల్లో ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి.