ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మాణం!

-పట్టించుకోని రెవెన్యూ అధికారులు.. చర్యలు ఎప్పుడు? సత్య వెలుగు న్యూస్ – పుత్తూరు, నవంబర్ 10: పుత్తూరు మండలం నందిమంగళం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 6, సబ్ డివిజన్ 3, 4, 5కు సంబంధించిన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ప్రహరీ గోడ నిర్మిస్తున్నప్పటికీ సంబంధిత రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉన్నప్పటికీ, ఈ నిర్మాణం విషయంలో అధికారులు...