ప్రభుత్వ భూమిలో అక్రమ గృహ నిర్మాణం.. అధికారుల నిర్లక్ష్యంపై దళిత, గిరిజన సంఘం ఆగ్రహం!

వడమల పేట, నవంబర్ 13 , సత్య వెలుగు న్యూస్: వడమాలపేట: మండలంలోని సీతారామపురం లెక్కదాఖలా గంగూరివారి కండ్రిగ వద్ద గుట్ట పోరంబోకు ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా గృహ నిర్మాణం జరుగుతోందని, దీనిపై సంబంధిత రెవెన్యూ, పంచాయతీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని దళిత, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి వై. నందయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ధనబలం, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు....