మరాఠీ గేట్ కాలువ కబ్జాపై అధికారులు స్పందించాలి!
-కాలువను ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు.. -నిలిచిపోతున్న వర్షపు నీటి ప్రవాహం – ప్రజలకు ఇబ్బందులు సత్య వెలుగు న్యూస్ – పుత్తూరు ,నందిమంగళం: నందిమంగళం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 226లో కొండ ప్రాంతం చివరి నుంచి మరాఠీ గేట్ వరకు ప్రవహించే సహజ వర్షపు నీటి కాలువ ఆక్రమణలకు గురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువను కొంతమంది అక్రమంగా ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని, కాలువ ఆనవాళ్లు సైతం కనుమరుగవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....