వాన, ఎండను సైతం లెక్కచేయకుండా కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జై భాగ్యరాజ్ ముమ్మర ప్రచారం!

సత్య వెలుగు న్యూస్ ,పుత్తూరు ,నవంబరు 2: పుత్తూరు మండల రూరల్ జెడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ జై భాగ్యరాజ్ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు అడవికండ్రిగ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను, ఓటర్లను కలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి, తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. వానను, ఎండను సైతం...