సాహసానికి సెల్యూట్… ధైర్యానికి జోహార్లు!
తోటి విద్యార్థినిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించిన బాలిక లక్ష్మికి రాష్ట్రపతి పురస్కారం ఇవ్వాలి! సత్య వెలుగు న్యూస్, పుత్తూరు,ఆంధ్ర ప్రదేశ్: రాప్తాడు ఘటనలో తోటి విద్యార్థినిపై రంపం మిషన్తో దాడికి పాల్పడిన వ్యక్తిని అడ్డుకునేందుకు, తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుకొచ్చిన బాలిక లక్ష్మి ధైర్యసాహసాలు అభినందనీయం. ప్రమాదం పొంచి ఉందని తెలిసినా తోటి విద్యార్థినిని రక్షించేందుకు ఆమె చేసిన ప్రయత్నం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది. దాడి జరిగిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటనలు చేయడం సులభమే. కానీ ప్రమాదం కళ్లముందు ఉన్నప్పుడు...