స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్య హక్కుల హననం: సీపీఐ, సీపీఎం ఆగ్రహం!

-చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారు: వామపక్ష నేతలు సత్య వెలుగు న్యూస్, పుత్తూరు, నవంబర్ 11: స్థానిక ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, ప్రతిపక్ష అభ్యర్థులకు బెదిరింపులు, పోలీసుల పక్షపాత వైఖరిని నిరసిస్తూ సీపీఐ, సీపీఎం నాయకులు బుధవారం అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ డివిజన్ కార్యదర్శి డి. మహేష్, సీపీఎం డివిజన్ కార్యదర్శి ఆర్. వెంకటేష్ మాట్లాడుతూ, ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. బలవంతపు ఏకగ్రీవాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని...