చౌడేపల్లిలో తెరిచి ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్‌.. ప్రమాదం పొంచి ఉంది

సత్య వెలుగు న్యూస్ | నవంబర్ 11 | చౌడేపల్లి: చౌడేపల్లి బజారు వీధిలోని ఇండియన్ బ్యాంక్ ఏటీఎం సమీపంలో డ్రైనేజీ మ్యాన్‌హోల్‌పై మూత లేకపోవడంతో ప్రజలు, వాహనదారులు ప్రమాద భయంతో ప్రయాణిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన కూడలిలో మ్యాన్‌హోల్‌ తెరిచి ఉండటంతో ముఖ్యంగా రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మ్యాన్‌హోల్‌పై మూత ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.