sathyavelugu.com
Date of Publish : 03 November 2026, 9:55 pm Posted by : Dr.K.Suresh Editor

చౌడేపల్లి తహసీల్దార్‌గా ప్రమీల నియామకం!

-పదవీ బాధ్యతలు స్వీకరించిన నూతన తహసీల్దార్..

-భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని వెల్లడి

చౌడేపల్లి, నవంబర్ 03, సత్య వెలుగు న్యూస్: చౌడేపల్లి మండల నూతన తహసీల్దార్‌గా ప్రమీల నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆమె స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.

ఇప్పటివరకు చౌడేపల్లి మండల తహసీల్దార్‌గా పనిచేస్తున్న పార్వతి పదవీ విరమణ చేయడంతో, ప్రస్తుతం సదుం మండలంలో విధులు నిర్వహిస్తున్న ప్రమీలను చౌడేపల్లికి బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆమె నూతన బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రమీల మాట్లాడుతూ మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాన్ని సంప్రదించవచ్చని, పారదర్శకంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని ఆమె తెలిపారు.