sathyavelugu.com
Date of Publish : 09 November 2026, 10:14 am Posted by : Dr.K.Suresh Editor

గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఇక ఓటీపీతో పనిలేదు!

సత్య వెలుగు న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్ వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. తుపానుల ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ డెలివరీకి OTP ధృవీకరణ నుంచి తాత్కాలిక మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల నుంచి నేరుగా సిలిండర్లు  నగదు చెల్లించి నేరుగా తీసుకెళ్లడం సదుపాయాన్ని కూడా వినియోగించుకోవచ్చు. ఈ మినహాయింపు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అమల్లో ఉంటుంది.