సగుటూరు ఎంపీటీసీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ రిటర్నింగ్ అధికారికి బీఎస్పీ అభ్యర్థి ఫిర్యాదు
సత్య వెలుగు న్యూస్ ,ఓజిలి: తిరుపతి జిల్లా ఓజిలి మండలం సగుటూరు ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి బహుజన సమాజ్ పార్టీ (BSP) అభ్యర్థిగా పోటీ చేసిన నాగిశెట్టి తులసమ్మ ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. సగుటూరు ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలోని వీర్లగునపాడు పోలింగ్ కేంద్రం నంబర్ 16/23 లో పోలింగ్ అధికారిగా విధులు నిర్వహించిన వై. సుబ్బారెడ్డి స్థానిక నాయకులతో కుమ్మక్కై వ్యవహరించారని ఆరోపించారు. బహుజన...