పాత ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ రిలీఫ్!

-ఫారం-6 ద్వారా మళ్లీ ఓటు హక్కు పొందే అవకాశం.. -తప్పుడు డిక్లరేషన్ భయాలకు చెక్! సత్య వెలుగు న్యూస్, నవంబర్ 4: ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైన పాత ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఓటర్ల జాబితాలో తమ పేర్లు తొలగిపోయిన వారు తిరిగి ఓటు హక్కు పొందేందుకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. దీంతో వివిధ కారణాలతో ఓటర్ల జాబితాలో పేరు కోల్పోయిన అర్హులైన పౌరులకు మరోసారి తమ ఓటు...