sathyavelugu.com
Date of Publish : 12 November 2026, 9:47 pm Posted by : Dr.K.Suresh Editor

నెల్లటూరులో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ , 96 మందికి హెచ్‌ఐవీ, సిఫిలిస్, షుగర్, బీపీ పరీక్షలు

సత్య వెలుగు న్యూస్: నవంబర్ 12: ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం ఆదేశాల మేరకు సార్డ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గూడూరు మండలం నెల్లటూరు గ్రామ సచివాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. చెన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో మొత్తం 96 మందికి హెచ్‌ఐవీ, సిఫిలిస్, షుగర్, రక్తపోటు పరీక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సార్డ్స్ ప్రాజెక్ట్ మేనేజర్ ఓ. జయచంద్ర మాట్లాడుతూ హెచ్‌ఐవీ ప్రధానంగా అసురక్షిత లైంగిక సంబంధాలు, కలుషిత సూదులు, సిరంజీల వినియోగం, హెచ్‌ఐవీ సోకిన తల్లి నుంచి బిడ్డకు సంక్రమించడం, కలుషిత రక్త మార్పిడి వంటి నాలుగు మార్గాల ద్వారా వ్యాపిస్తుందని వివరించారు. హెచ్‌ఐవీ ఉన్న గర్భిణుల నుంచి బిడ్డకు వైరస్ సంక్రమించకుండా తగిన వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. హెచ్‌ఐవీ చట్టం-2017 గురించి అవగాహన కల్పించారు. హెచ్‌ఐవీకి సంబంధించిన సందేహాలు, సమాచార వివరాల కోసం 1097 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ఎం. జ్యోతి, వైద్య సిబ్బంది, సార్డ్స్ ప్రాజెక్ట్ మేనేజర్ ఓ. జయచంద్ర, కౌన్సిలర్ డి. అనిత, రమేష్, లక్ష్మమ్మ, ఎస్తేర్, బ్యూల తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ హెచ్‌ఐవీపై అవగాహన కల్పించారు.