నాయుడుపేట 2వ వార్డు ఎన్నికల ఫలితంపై వివాదం.. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అరెస్ట్!
నాయుడుపేట, నవంబర్ 3: తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలోని 2వ వార్డు ఎన్నికల ఫలితంపై తీవ్ర వివాదం చోటుచేసుకుంది. తొలుత జరిగిన ఓట్ల లెక్కింపులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మూడు ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. అయితే టీడీపీ అభ్యర్థి రీకౌంటింగ్ కోరడంతో అధికారులు మరోసారి ఓట్లను లెక్కించారు. రీకౌంటింగ్ అనంతరం టీడీపీ అభ్యర్థి ఆరు ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫలితంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ...