sathyavelugu.com
Date of Publish : 05 November 2026, 6:23 pm Posted by : Dr.K.Suresh Editor

సొంత గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న సత్య వెలుగు న్యూస్ ఎడిటర్ డాక్టర్ కుంపటి సురేష్!

ఓటు మన హక్కు.. ప్రజాస్వామ్య పరిరక్షణ మన బాధ్యత: డాక్టర్ కుంపటి సురేష్

సిరసనంబేడు, నవంబర్ 5 (సత్య వెలుగు న్యూస్): సత్య వెలుగు న్యూస్ ఎడిటర్ డాక్టర్ కుంపటి సురేష్ తన సతీమణి డాక్టర్ కమలతో కలిసి తమ సొంత గ్రామమైన సిరసనంబేడులో స్థానిక ఎన్నికల సందర్భంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ కుంపటి సురేష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని సూచించారు.

“ఓటు మన హక్కు.. ప్రజాస్వామ్య పరిరక్షణ మన బాధ్యత” అని పేర్కొంటూ, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ తమ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని ఆయన తెలిపారు. ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ఈ సందర్భంగా డాక్టర్ కుంపటి సురేష్ ప్రజలకు సందేశమిచ్చారు.