సొంత గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న సత్య వెలుగు న్యూస్ ఎడిటర్ డాక్టర్ కుంపటి సురేష్!

ఓటు మన హక్కు.. ప్రజాస్వామ్య పరిరక్షణ మన బాధ్యత: డాక్టర్ కుంపటి సురేష్ సిరసనంబేడు, నవంబర్ 5 (సత్య వెలుగు న్యూస్): సత్య వెలుగు న్యూస్ ఎడిటర్ డాక్టర్ కుంపటి సురేష్ తన సతీమణి డాక్టర్ కమలతో కలిసి తమ సొంత గ్రామమైన సిరసనంబేడులో స్థానిక ఎన్నికల సందర్భంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కుంపటి సురేష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని సూచించారు....