నాయుడుపేటలో అగ్నిప్రమాదం.. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యమే కారణమా?

-ఏడేళ్లుగా బిల్డింగ్‌లోనే మగ్గుతున్న కాలం చెల్లిన ఆహార పదార్థాలు.. -పేలుడు శబ్దాలు, విషవాయువులతో ప్రజల్లో ఆందోళన! నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్: నాయుడుపేట పట్టణ నడిబొడ్డున, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. బ్యాంకు అధికారులు సీజ్ చేసిన భవనంలో భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందా? అనే ప్రశ్నలు స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు ఏడేళ్లుగా సీజ్ చేసిన భవనంలో కూల్‌డ్రింక్స్ బాటిళ్లు, చిప్స్ ప్యాకెట్లు, కుర్‌కురే...