ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు
సత్య వెలుగు న్యూస్ , నాయుడుపేట, నవంబర్ 12: -నూతన విద్యార్థులకుఆత్మీయ స్వాగతం.. -యూనిఫారాలు పంపిణీ చేసిన పారిశ్రామికవేత్త పెసల రాజగోపాల్ నాయుడుపేట స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో నూతనంగా చేరిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ గురువారం ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. లక్ష్మిప్రసన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. లక్ష్మిప్రసన్న మాట్లాడుతూ కళాశాలలో అందుబాటులో ఉన్న వివిధ కోర్సులు, విద్యార్థులకు కల్పిస్తున్న...