నాయుడుపేట మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం సంతోషకరం: మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
-ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిన నాయుడుపేట ప్రజలకు కృతజ్ఞతలు సత్య వెలుగు న్యూస్ | నవంబర్ 1 | నాయుడుపేట: నాయుడుపేట మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ముగియడం సంతోషకరమైన విషయమని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతూ ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్న నాయుడుపేట మున్సిపాలిటీ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా,...