జైలు గోడల మధ్య భర్త.. ప్రజాక్షేత్రంలో భార్య పోరాటం!
-పెళ్లకూరు జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఘనవిజయం -ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టిన భార్య.. ప్రజాతీర్పుతో ప్రత్యర్థులకు సమాధానం! సత్య వెలుగు న్యూస్ ,పెళ్లకూరు: రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ కొన్ని విజయాలు మాత్రం ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటాయి. అలాంటి ఆసక్తికరమైన రాజకీయ పరిణామానికి పెళ్లకూరు మండల జడ్పీటీసీ ఎన్నికల ఫలితం వేదికగా నిలిచింది. ఒకవైపు జైలు గోడల మధ్య భర్త.. మరోవైపు ప్రజాక్షేత్రంలో ఎన్నికల ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్న భార్య.. ఎన్నో ప్రతికూల పరిస్థితులను...