నాపై నమ్మకంతో విజయం అందించిన నాయుడుపేట ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా: తంబిరెడ్డి రాజేశ్వరమ్మ

సత్య వెలుగు న్యూస్ – నవంబర్ 3, నాయుడుపేట: నాయుడుపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఘన విజయం అందించిన పట్టణ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఓటు వేసి విజయాన్ని అందించిన ప్రతి ఒక్క ఓటరుకు, నాయుడుపేట పట్టణ ప్రజలకు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, చైర్‌పర్సన్‌గా తనకు అప్పగించిన బాధ్యతలను...